మీరు ఇంటర్ పూర్తి చేసి లేదా డిగ్రీ పూర్తి చేసి, మీ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, ఒక మంచి కంపెనీ లో Work From Home జాబ్ కోసం చూస్తున్నారా? అయితే, మీ కోసం Tech Mahindra కంపెనీ కస్టమర్ కేర్ విభాగం లో జాబ్ అవకాశం కలిపిస్తుంది. మీరు ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటె, ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి, వెంటనే అప్లై చేసుకోండి.
Tech Mahindra Customer Care Job 2025
ఉద్యోగ వివరాలు
కంపెనీ పేరు | టెక్ మహీంద్రా |
ఉద్యోగం పేరు | వాయిస్ ప్రాసెస్ – వర్క్ ఫ్రం హోమ్ |
ఉద్యోగ సంఖ్య | 500 ఖాళీలు |
లొకేషన్ | ఇంటి నుంచే పని |
అనుభవం అవసరం | 0 నుండి 3 సంవత్సరాలు |
జీతం | ₹2.10 లక్షల వరకు వార్షికంగా |
ఉద్యోగ రకం | ఫుల్ టైమ్, పెర్మనెంట్ |
ఈ ఉద్యోగం పూర్తిగా ఇంటి నుంచే చేయవచ్చు. మీ వద్ద కావాల్సినవి:
- i5 ప్రాసెసర్ గల ల్యాప్‌టాప్ లేదా అంతకన్నా అధికమైన ప్రాసెసర్ ఉండాలి
- కనీసం 8GB RAM ఉండాలి
- మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి
- Wi-Fi సపోర్ట్ ఉండాలి
అర్హతల వివరాలు
- ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసినవారు అప్లై చేయొచ్చు
- ఫ్రెషర్స్ మరియు అనుభవం ఉన్నవారు ఇద్దరూ అప్లై చేయొచ్చు
- కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి
- వెంటనే జాయిన్ అయ్యే వాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది
ఈ ఉద్యోగానికి ఎలాంటి స్పెషల్ డిగ్రీ అవసరం లేదు. మీ కమ్యూనికేషన్ బాగుంటే చాలు.
వయో పరిమితి
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి, కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఎవరైనా మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి, కొంత డబ్బు (రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ వంటివి) కట్టమని అడిగితే, అది ఫ్రాడ్ అని గుర్తించండి. పెద్ద MNC కంపెనీలు ఎవరినీ అప్లికేషన్ ఫీజు అడగవు. మీరు ఎవరికీ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.
Tech Mahindra గురించి
టెక్ మహీంద్రా అనేది ఇండియాలో ఉన్న పెద్ద IT కంపెనీ. ఇది మహీంద్రా గ్రూప్‌కు చెందింది. ప్రపంచం నలుమూలలా 90కి పైగా దేశాల్లో ఈ కంపెనీ సేవలు అందిస్తోంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, బిజినెస్ కన్‌సల్టింగ్, బీపీయో వంటి విభాగాల్లో సేవలు అందిస్తోంది. ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, IOT వంటి ఆధునిక టెక్నాలజీలు ఉపయోగించి కంపెనీలను అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంది.
అప్లై చేయడం ఎలా?
ఈ ఉద్యోగానికి ఆసక్తి ఉన్నవారు, వారి రెజ్యూమ్‌ను అధికారిక నోటిఫికేషన్‌లో ఉన్న HR మొబైల్ నెంబర్ కి పంపాలి లేదా కింద ఉన్న అప్లికేషన్ లింక్ ఉపయోగించి అప్లై చేసుకోగలరు.
అప్లై చేసేందుకు లింక్:
👉ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయండి
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
ముఖ్యమైన విషయాలు:
- ఇది ఫుల్ టైమ్, పెర్మనెంట్ ఉద్యోగం
- అప్లై చేసేవారికి తగినంత సిస్టమ్ కన్ఫిగరేషన్ ఉండాలి
- జీతం అనుభవాన్ని బట్టి మారవచ్చు
రెజ్యూమ్ కోసం సింపుల్ చిట్కాలు:
1. పర్సనల్ డీటైల్స్ క్లియర్‌గా ఉండాలి:
పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ తప్పక రాయండి. వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి, మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయండి.
2. ఐటి స్కిల్స్ & సిస్టమ్ నాలెడ్జ్:
మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉందని, RAM, Processor, Wi-Fi ఉండేలా చెప్పండి. ఈ జాబ్‌కు సిస్టమ్ అవసరం కాబట్టి దీని గురించి రాయండి.
3. కమ్యూనికేషన్ స్కిల్స్ హైలైట్ చేయండి:
“Good communication skills in English and Hindi” లేదా “Fluent in speaking and understanding customer needs” అని ఒక లైన్ రాయండి.
4. సింగిల్ పేజీలో పూర్తి చేయండి:
ఫ్రెషర్స్ కాబట్టి పెద్దగా వివరాలు అవసరం లేదు. ఒకే పేజీలో, neat గా ఉండేలా చూసుకోండి.
ఇంటర్వ్యూ కోసం చిట్కాలు:
1. స్మైల్‌తో మాట్లాడండి:
ఇంటర్వ్యూ కాల్‌లో మాట్లాడేటప్పుడు స్మైల్ ఉండాలి. అలా మాట్లాడితే నేచురల్‌గా, ఫ్రెండ్లీగా వినిపిస్తుంది.
2. పూర్తిగా వినండి, అప్పుడు చెప్పండి:
ఇంటర్వ్యూలో ఏ ప్రశ్న అడిగితే, మధ్యలో చెప్పకుండా, పూర్తి విని అప్పుడు సమాధానం చెప్పండి.
3. సింపుల్ మాటలు ఉపయోగించండి:
తెలివిగా కనిపించాలి అని బిగ్ big words వాడక్కరలేదు. సింపుల్‌గా, స్పష్టంగా మాట్లాడండి.
4. “Why do you want this job?” అన్న ప్రశ్నకు ఇలా చెప్పవచ్చు:
“ఇంటర్నెట్ ద్వారా ఇంటి నుంచే పని చేయగలిగే అవకాశం ఇది. నన్ను మోటివేట్ చేసే వర్క్ ఎన్విరాన్‌మెంట్ కావాలనుకుంటున్నాను.”
5. ప్రాక్టీస్ చెయ్యండి:
ఇంటర్వ్యూకి ముందు ఫోన్ తీసుకుని ఫ్రెండ్‌తో లేదా అద్దంలో ప్రాక్టీస్ చేయండి. ఇది మీ కాన్ఫిడెన్స్ పెంచుతుంది.
Tech Mahindra Customer Care జాబ్ రోల్
ఈ జాబ్ టెక్ మహీంద్రా కంపెనీలో వాయిస్ ప్రాసెస్ అనే డిపార్ట్‌మెంట్ కి సంబంధించినది. మీరు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ లా పనిచేస్తారు. మీ పని ఏమిటంటే – కంపెనీకి ఫోన్ చేసే కస్టమర్లకి సహాయం చేయడం, వాళ్ల సందేహాలు, సమస్యలు విన్నిమీ సమాధానం ఇవ్వడం.
ఇది పూర్తిగా వాయిస్ బేస్డ్ జాబ్, అంటే ఫోన్ కాల్స్ ద్వారా కస్టమర్లతో మాట్లాడాలి. English లేదా Hindi లో మాట్లాడగలిగితే చాలు.
మీరు చెప్పే మాటలతోనే కస్టమర్ సంతృప్తిగా అనిపించుకోవాలి, అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం.
ఈ జాబ్‌కి మీరు ఇంటి నుంచే పని చేస్తారు (Work From Home). ఉదయాన్నే లేచి ట్రాఫిక్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సిస్టమ్ పెట్టుకుని, Wi-Fi ద్వారా కనెక్ట్ అయి డ్యూటీ చేస్తారు.
మీ డ్యూటీలు ఏమిటంటే:
- కస్టమర్ల కాల్స్ తీసుకోవడం
- వాళ్లకు అవసరమైన సమాచారం ఇవ్వడం
- ఏదైనా సమస్య వస్తే, సరిగ్గా గైడ్ చేయడం
- ఫ్రెండ్‌లాగా, సహాయకులా మాట్లాడటం
అంటే, ఈ జాబ్‌లో మీరు ఒక మంచి కమ్యూనికేటర్ వ్యక్తిగా ఉండాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు
1. ఈ ఉద్యోగానికి డిగ్రీ తప్పనిసరా?
లేదు. ఇంటర్ పూర్తి చేసి కమ్యూనికేషన్ బాగా ఉన్నవారు కూడా అప్లై చేయొచ్చు.
2. ఫ్రెషర్స్ కి ఛాన్స్ ఉందా?
అవును. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు.
3. జాబ్ పూర్తి వర్క్ ఫ్రం హోమేనా?
అవును. మీరు పూర్తిగా ఇంటి నుంచే పని చేయవచ్చు. సరైన సిస్టమ్, ఇంటర్నెట్ ఉండాలి.
4. ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఉంటుంది?
ఈ ఉద్యోగం కస్టమర్ సపోర్ట్, సర్వీస్ & ఆపరేషన్స్ విభాగానికి సంబంధించినది. వాయిస్ ప్రాసెస్ జాబ్.
5. ఎక్కడ అప్లై చేయాలి?
మీరు అధికారిక నోటిఫికేషన్ లో ఉన్న HR కి మీ రెజ్యూమ్ పంపాలి లేదా పై ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేయవచ్చు.
ఈ ఉద్యోగం ఇంటి నుంచే పని చేయాలనుకునే వారికి మంచి అవకాశం. మీ వద్ద సరైన సిస్టమ్, ఇంటర్నెట్ ఉంటే, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వెంటనే అప్లై చేయండి.
Disclaimer:
ఈ వెబ్‌సైట్‌లో ఇచ్చిన Tech Mahindra Customer Care Job 2025కి సంబంధించిన సమాచారం, అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా అందించబడింది. అయితే, అప్లై చేసే ముందు దయచేసి అధికారిక వెబ్‌సైట్ లో పూర్తి వివరాలు చదవడం మంచిది.
మేము అందించిన సమాచారం సాధ్యమైనంతవరకు సరైనదే అయినా, ఏదైనా మార్పులు/తప్పిదాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన చివరి తేదీలు, అర్హతలు, ఇతర వివరాల్లో మార్పులు జరిగితే, దానికి మేము బాధ్యత వహించము. చివరిగా, దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్‌ను తప్పక చదవండి.