Qualcomm Associate Engineer Job 2025–ఫ్రెషర్స్‌ కోసం Hyderabad లో జాబ్ ఛాన్స్!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ కంపెనీ అయిన Qualcomm వారు Associate Engineer పోస్టుల కోసం Off Campus Drive 2025 నిర్వహిస్తున్నారు. మీరు ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లాంటి కోర్సులలో డిగ్రీ పూర్తి చేసి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో నాలెడ్జ్ ఉంటే చాలు, వెంటనే అప్లై చేయొచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. ఈ పోస్టుకు సంబంధించి అన్ని వివరాలు సులభంగా అర్థమయ్యేలా మీ కోసం సిద్ధం చేశాం. దయచేసి పూర్తిగా చదివి, మీకు అర్హత ఉంటే తప్పక అప్లై చేయండి.

Qualcomm Associate Engineer Job 2025

కంపెనీ గురించి

Qualcomm అనేది అమెరికాలో ఉన్న ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ. ఇది 5G, 4G వంటి వయర్‌లెస్ టెక్నాలజీస్‌కు అవసరమైన చిప్స్, సాఫ్ట్‌వేర్, మరియు ఇతర సేవలను అందించే పెద్ద సంస్థ. ఇది సాన్ డియాగో, కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయంతో ఉంటుంది. 5G, 4G, CDMA2000, TD-SCDMA, WCDMA వంటి టెక్నాలజీలకు అవసరమైన పేటెంట్స్ ఎక్కువగా Qualcomm వద్దే ఉన్నాయి.

Qualcomm Off Campus Drive 2025 – ఉద్యోగ వివరాలు

అంశంవివరాలు
కంపెనీ పేరుQualcomm
ఉద్యోగ రోల్Associate Engineer
అర్హతఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత డిగ్రీ
అనుభవం0 నుండి 1 సంవత్సరం వరకు
స్కిల్స్ అవసరంWLAN & BT ప్రోటోకాల్ జ్ఞానం తప్పనిసరి, C, C++, Java, Python వంటి లాంగ్వేజెస్ తెలిసినవారు
జాబ్ లొకేషన్హైదరాబాద్
జీతంఇండస్ట్రీలో బెస్ట్‌గా ఉంటుంది
అప్లై చేయాల్సిన చివరి తేదీత్వరలోగా అప్లై చేయాలి (ASAP)

అర్హతలు (Eligibility Criteria)

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీరు ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత ఏదైనా డిగ్రీ చేసివుండాలి. అదనంగా,

  • మీరు 0 నుండి 1 సంవత్సరానికి లోపు అనుభవం కలిగి ఉండాలి.
  • WLAN & Bluetooth ప్రోటోకాల్పై బేసిక్ అర్థం ఉండాలి (తప్పనిసరి).
  • C, C++, C#, Java, Python లాంటి లాంగ్వేజెస్‌లో ఏదైనా ఒకటి అయినా తెలిసి ఉంటే చాలా మంచిది.
  • టెస్ట్ ప్లాన్స్ డిజైన్ చేయడం, ఆపరేట్ చేయడం, అలాగే Automation tools తో పని చేయగలగాలి.

ట్రైనింగ్

సెలెక్ట్ అయినా తర్వాత, మీకు కేటాయించిన ప్రాజెక్ట్‌పై ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్‌లో తీసుకుంటారు. ట్రైనింగ్ సమయం లో కూడా మీకు నిర్దారించిన శాలరీ ఇస్తారు.

ల్యాప్‌టాప్

ఎంపికైన అభ్యర్థులకు ల్యాప్‌టాప్ కంపెనీ నుంచి ఉచితంగా అందుతుంది. ఈ ల్యాప్‌టాప్‌తో మీరు ఉద్యోగానికి సంబంధించిన పనులు చేయవచ్చు.

ఉద్యోగ ప్రదేశం

హైదరాబాద్.

జీతం గురించి

Qualcomm వారి స్టాండర్డ్ ప్రకారం, ఈ ఉద్యోగానికి బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ స్థాయిలో జీతం ఇస్తారు. మీకు ఉన్న స్కిల్స్, ఇంటర్వ్యూలో ప్రదర్శన ఆధారంగా డిసైడ్ అవుతుంది.

వయో పరిమితి

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి, కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

సెలెక్షన్ ప్రాసెస్

మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత, కంపెనీ మీ దరఖాస్తును జాగ్రత్తగా చూస్తుంది. ఆ తర్వాత, మిమ్మల్ని ఇంటర్వ్యూలకు పిలుస్తారు లేదా ఆన్లైన్ లో ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ లో మీతో మాట్లాడి, మీలోని నైపుణ్యాలు, మీ అర్హతలు ఎంతవరకు సరిపోతాయో చూస్తారు. అలాగే, మీరు కంపెనీ వాతావరణానికి ఎంత బాగా సరిపోతారనేది కూడా అంచనా వేస్తారు.

ఇవి పూర్తయిన తర్వాత, మీ గత అనుభవాలను తెలుసుకోవడానికి రెఫరెన్స్ చెక్స్ చేస్తారు. అంటే, మీరు గతంలో పని చేసిన చోట్ల మీ గురించి ఆరా తీస్తారు. అలాగే, మీ బ్యాక్‌గ్రౌండ్‌ను కూడా పరిశీలిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక, మీకు ఉద్యోగ ఆఫర్ ఇస్తారు. అప్పుడు మీరు కంపెనీలో చేరడానికి సిద్ధంగా ఉంటారు, దీనినే ఆన్-బోర్డింగ్ అంటారు.

ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చదవండి.

చివరి తేదీ

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి తొందరగా అప్లై చేయాలి (ASAP) అని పేర్కొన్నారు. అఫీషియల్ లింక్ ఓపెన్ ఉన్నంత వరకు అప్లై చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి.

ఎలా అప్లై చేయాలి?

ఈ Qualcomm Off Campus Drive 2025 కోసం అప్లై చేయాలనుకునే అభ్యర్థులు క్రింది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయండి

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు ఫీజు

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఎవరైనా మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి, కొంత డబ్బు (రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ వంటివి) కట్టమని అడిగితే, అది ఫ్రాడ్ అని గుర్తించండి. పెద్ద MNC కంపెనీలు ఎవరినీ అప్లికేషన్ ఫీజు అడగవు. మీరు ఎవరికీ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.

ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

Resume తయారీకి సరైన టిప్స్ (Resume Preparation Tips)

1. రిజ్యూమ్ చిన్నదిగా, స్పష్టంగా ఉండాలి:
2 పేజీలు మించకుండా ఉండాలి. మీ చదువు, ప్రాజెక్ట్స్, టెక్నికల్ స్కిల్స్ క్లియర్‌గా రాయండి.

2. టెస్టింగ్ కు సంబంధించి నైపుణ్యాలు స్పష్టంగా చూపించండి:
ఈ జాబ్‌కి టెస్ట్ ప్లాన్‌లు, ఆటోమేషన్, బగ్ ట్రాకింగ్ టూల్స్ తెలిసి ఉండటం అవసరం. మీరు తెలిసిన Selenium, JIRA, Git, Jenkins వంటి టూల్స్ ఉంటే స్పష్టంగా రాయండి.

3. WLAN, BT Knowledge ఉందని హైలైట్ చేయండి:
ఇది తప్పనిసరిగా కావాల్సిన స్కిల్. మీకి తెలిసిన ప్రోటోకాల్‌లు, రిసెర్చ్ లేదా ప్రాజెక్ట్స్ ఉంటే వాటిని చిన్నగా పొందుపరచండి.

4. Programming Languages గురించి స్పష్టంగా రాయండి:
C, C++, Java, Python వంటి లాంగ్వేజెస్‌లో మీకు ఏవి వస్తాయో క్లియర్‌గా రాయండి – “Basic knowledge of Python”, “Familiar with C++” లాంటి విధంగా.

5. Final year project ని బాగా వివరించండి:
ప్రాజెక్ట్ టెస్టింగ్/ఆటోమేషన్ మీదైతే అది చాలా ప్లస్. ఏ టెక్నాలజీ వాడారు, మీరు ఏ భాగం చేశారో వివరించండి.

6. Resume లో చిన్న Summary పెట్టండి:
మీ రిజ్యూమ్ మొదటే “Self-motivated fresher with basic experience in software testing and scripting, looking to build a career with Qualcomm.” లాంటి లైన్ పెట్టండి.

ఇంటర్వ్యూకు సిద్ధమయ్యే టిప్స్ (Interview Tips)

1. Manual + Automation Testing Concepts బాగా చదవండి:
మీకు వేరే ప్రాజెక్ట్ అనుభవం లేకపోయినా, Test Cases ఎలా రాయాలి, Bug Reporting ఎలా చేయాలి, Automation ఎలా మొదలుపెట్టాలి అన్నది క్లియర్‌గా రాకపోతే ఇంటర్వ్యూలో ఇబ్బంది అవుతుంది.

2. WLAN & Bluetooth ప్రోటోకాల్ బేసిక్స్ తెలుసుకోండి:
WLAN అంటే ఏంటి? Bluetooth ఎలా పని చేస్తుంది? దీని గురించి నెట్‌లో 2-3 రోజులు రివిజన్ చేయండి.

3. సింపుల్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి:
బేసిక్ C/Python లో “Palindrome”, “Factorial”, “Array reversal” లాంటి చిన్న problems practice చేయండి. మీకు logic explain చేయగలగాలి.

4. Communication స్పష్టంగా ఉండాలి:
ఇంగ్లీష్ లో మాట్లాడాలన్న టెన్షన్ పెట్టుకోకండి. మీకు ఏ భాష కంఫర్ట్ అనిపిస్తే అదే ఉపయోగించండి కానీ answer మాత్రం క్లియర్‌గా చెప్పండి. Tech terms miss కాకుండా మాట్లాడండి.

5. Mock Interviews ప్రాక్టీస్ చేయండి:
మీ ఫ్రెండ్స్ లేదా మీరే మిర్రర్ ముందు నిలబడి, “Tell me about yourself”, “Why do you want to join Qualcomm?” లాంటి ప్రశ్నలకి ప్రాక్టీస్ చేయండి.

6. Resume లో ఉన్న దాంట్లో మీరు చెప్పలేని విషయం పెట్టొద్దు:
మీకు అసలు తెలియని tools/responsibilities రిజ్యూమ్‌లో రాయడం వల్ల, ఇంటర్వ్యూలో పట్టుబడి నెగటివ్ ఇంప్రెషన్ పడుతుంది.

7. చివర్లో ఏమైనా అడగాలంటే ముందుగా సిద్ధం చేసుకోండి:
“Is there a training period for freshers?”, “What kind of projects will I be assigned?” లాంటి ప్రశ్నలు అడిగితే మంచి ఇంప్రెషన్ పడుతుంది.

ఈ జాబ్‌కి చాలా మంది apply చేస్తారు. కానీ మీరు మీ రిజ్యూమ్ బాగా సిద్ధం చేసి, ఇంటర్వ్యూకి నమ్మకంగా హాజరవైతే – అవకాశం మీ చేతిలో ఉంటుంది.
Practice, Patience, మరియు Preparation – ఇవి మీ సక్సెస్ కి కీలకం!

తరచుగా అడిగే ప్రశ్నలు

1) ఈ ఉద్యోగానికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయచ్చా?
అవును, ఇది ఫ్రెషర్స్‌కి ప్రత్యేకంగా ఇచ్చిన అవకాశం. మీకు 0 నుండి 1 సంవత్సరం అనుభవం ఉంటే సరిపోతుంది.

2) ఏ బ్రాంచ్ విద్యార్థులు అప్లై చేయవచ్చు?
ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ వంటి బ్రాంచ్‌లలో డిగ్రీ చేసినవాళ్లు అప్లై చేయవచ్చు.

3) జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది?
ఈ ఉద్యోగం హైదరాబాద్‌లో ఉంటుంది. అక్కడ పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.

4) జీతం ఎంత ఇస్తారు?
ఇండస్ట్రీలో బెస్ట్‌గా ఇస్తారు అని చెప్పారు. ఖచ్చితమైన వివరాలు ఇంటర్వ్యూలో తెలియజేస్తారు.

5) అప్లై చేసే చివరి తేదీ ఎప్పటి వరకు ఉంటుంది?
పూర్తిగా నిర్ణయించలేదు కానీ, “ASAP” అని పేర్కొనడంతో వెంటనే అప్లై చేయడం ఉత్తమం.

Leave a Comment