ఇండియామార్ట్ అనే కంపెనీ ఇప్పుడు Tele Associate – Content Enrichment అనే పేరుతో ఇంటి నుంచే పని చేసే జాబ్‌కి హైరింగ్ చేస్తోంది. రోజుకి 3-4 గంటలు మాత్రమే పని చేస్తే చాలు. ఫోన్ ద్వారా కస్టమర్లతో మాట్లాడి, వారి బిజినెస్ ప్రొఫైల్‌ని అప్‌డేట్ చేసే సింపుల్ వర్క్. కంప్యూటర్, మొబైల్, ఇంటర్నెట్ ఉంటే చాలూ – జాబ్ రెడీ! ఏదైనా డిగ్రీ పూర్తి చేసి వర్క్ ఫ్రొం హోమ్ జాబ్ కోసం చేస్తున్నవారికి ఇది ఒక గొప్ప అవకాశం. మొత్తం 5000 ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకొని, వెంటనే అప్లై చేసుకోండి.
IndiaMart Tele Associate Recruitment 2025
ఉద్యోగం పేరు: Tele Associate – Free Listed Seller Content Enrichment
కంపెనీ పేరు: IndiaMART
పని స్థలం: Work from Home (పూర్తిగా ఇంటి నుంచే పని).
ఉద్యోగానికి ఎవరు అర్హులు?
అర్హతలు | వివరాలు |
---|---|
అనుభవం | 0 నుండి 5 ఏళ్ళ వరకు |
అర్హత | ఏదైనా డిగ్రీ |
పని రోజులూ | సోమవారం నుండి శనివారం వరకూ |
రోజుకి పని గంటలు | కనీసం 3-4 గంటలు |
పని సమయం | ఉదయం 9 నుండి సాయంత్రం 7 మధ్య ఎప్పుడు అయినా పనిచేయవచ్చు |
జీతం | కంపెనీ తెలియజేయలేదు |
ఉద్యోగ రకం | పార్ట్ టైం – వర్క్ ఫ్రం హోమ్ |
ఈ Tele Associate ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లెవరైనా అప్లై చేయవచ్చు. మీరు ఫ్రెషర్ అయినా సరే, లేదా కొంచెం అనుభవం ఉన్నా కూడా ఈ ఉద్యోగానికి అర్హులే.
ట్రైనింగ్
సెలెక్ట్ అయినా తర్వాత, మీకు కేటాయించిన ప్రాజెక్ట్‌పై ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్‌లో తీసుకుంటారు. ట్రైనింగ్ సమయం లో కూడా మీకు నిర్దారించిన శాలరీ ఇస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్
మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత, కంపెనీ మీ దరఖాస్తును జాగ్రత్తగా చూస్తుంది. ఆ తర్వాత, మిమ్మల్ని ఇంటర్వ్యూలకు పిలుస్తారు లేదా ఆన్లైన్ లో ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ లో మీతో మాట్లాడి, మీలోని నైపుణ్యాలు, మీ అర్హతలు ఎంతవరకు సరిపోతాయో చూస్తారు. అలాగే, మీరు కంపెనీ వాతావరణానికి ఎంత బాగా సరిపోతారనేది కూడా అంచనా వేస్తారు.
IndiaMart Tele Associate Recruitment 2025
ముఖ్యమైన బాధ్యతలు – మీరు చేసే పని ఏమిటంటే…
- సెల్లర్ వివరాల పరిశీలన: ముందుగా మీకు అప్పగించిన సెల్లర్ వివరాలు చూసి, వారు ప్రస్తుతం అర్హులు కాదో తెలుసుకోవాలి.
- ఫోన్ కాల్ ద్వారా కనెక్ట్ అవ్వాలి: సెల్లర్లను ఫోన్‌లో సంప్రదించి, వారి సమాచారం సేకరించాలి.
- సెల్లర్ ప్రొఫైల్ అప్‌డేట్ చేయాలి: సేకరించిన సమాచారం ఆధారంగా వారి ప్రొఫైల్‌కి అవసరమైన మార్పులు చేయాలి.
- వారికి స్పష్టత ఇవ్వాలి: ఈ జాబ్ ద్వారా వాళ్ల బిజినెస్‌కి లాభమేం ఉంటుందో చెప్పాలి.
- వివరాలు రికార్డ్ చేయాలి: మాట్లాడిన ప్రతి విషయం సరైన రీతిలో నమోదు చేయాలి.
- సెల్లర్ అభ్యర్థనలపై ఫాలోప్ చేయాలి: సెల్లర్ ఏమైనా అభ్యర్థన చేస్తే దానిపై తిరిగి కాల్ చేయాలి.
- టార్గెట్ అందుకోవాలి: రోజూ/వారానికి/నెలకి నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవాలి.
సాధారణంగా రోజుకి 3–4 గంటల పాటు పని చేస్తే చాలు. కానీ ప్రతిరోజూ ఇచ్చిన టార్గెట్ నంబర్‌కి ఫోన్ కాల్స్ చేసి, సమాచారం సేకరించాలి.
వర్క్ ఫ్రం హోమ్‌కు అవసరమైన టెక్నికల్ అవసరాలు
ఈ ఉద్యోగం వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి కొన్ని వస్తువులు మీ వద్ద ఉండాలి:
- ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ – స్మూత్‌గా పని చేయడానికి అవసరం.
- ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ – సెల్లర్‌కి కాల్ చేయడానికి.
- వేరే సిమ్‌తో కాలింగ్ చేయాల్సి ఉంటుంది – మీ వ్యక్తిగత నంబర్ కాకుండా వేరే సిమ్ వాడాలి.
- ఇంటర్నెట్ కనెక్షన్ – వీడియో/వాయిస్ కాల్స్ సరళంగా జరిగేలా.
- ప్రైవేట్ పని చేసే చోటు – ఇంట్లో శాంతిగా పని చేయగలిగే ఒక టేబుల్, కుర్చీ ఉండాలి.
అవసరమైన స్కిల్స్
ఈ జాబ్‌కి ముఖ్యంగా కమ్యూనికేషన్‌లో నైపుణ్యం ఉండాలి.
మీరు కస్టమర్‌తో ఓపికగా మాట్లాడగలగాలి.
ఇతర అవసరమైన స్కిల్స్:
- టెలికమ్యూనికేషన్
- కమ్యూనికేషన్ స్కిల్స్
- లీడ్ జనరేషన్
- MS Office ఉపయోగించగలగడం
విద్యార్హత
- అండర్‌గ్రాడ్యుయేట్: ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు
- పోస్ట్ గ్రాడ్యుయేట్: ఎవరైనా పీజీ చదివినవారు కూడా అప్లై చేయవచ్చు
IndiaMart Tele Associate Recruitment 2025
దరఖాస్తు ఫీజు
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఎవరైనా మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి, కొంత డబ్బు (రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ వంటివి) కట్టమని అడిగితే, అది ఫ్రాడ్ అని గుర్తించండి. పెద్ద MNC కంపెనీలు ఎవరినీ అప్లికేషన్ ఫీజు అడగవు. మీరు ఎవరికీ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
కంపెనీ గురించి – IndiaMART
IndiaMART.com అనేది భారతదేశంలోనే అతిపెద్ద B2B (Business to Business) మార్కెట్‌ప్లేస్. 1996లో ప్రారంభమైన ఈ సంస్థకు ISO 9001:2000 సర్టిఫికేషన్ ఉంది. దేశవ్యాప్తంగా 75 బ్రాంచ్‌లు, 4000కి పైగా ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ, వాణిజ్యరంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బయ్యర్లను ఇండియన్ సెల్లర్లతో కలిపే చక్కటి వేదికగా పని చేస్తోంది. Intel Capital, Times Group వంటి సంస్థలు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాయి. లాభాల్లో నడుస్తూ 1 మిలియన్‌కి పైగా సభ్యులకి సర్వీసులు అందిస్తోంది.
అప్లై చేసేందుకు లింక్:
👉 ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయండి
వర్క్ ఫ్రం హోమ్ జాబ్‌కి రిజ్యూమ్ ఎలా తయారు చేయాలి?
ఈ ఇండియామార్ట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్‌కి రిజ్యూమ్ తయారు చేయడం చాలా సులువు. మీ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వ్యక్తిగత వివరాలు స్పష్టంగా రాయాలి. మీరు ఏ డిగ్రీ చదివారో, ఎక్కడ చదివారో క్లియర్‌గా రాయండి. కమ్యూనికేషన్ స్కిల్స్, MS Office వాడగలగడం, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇంటర్నెట్ వాడటం వంటివి మీకు వస్తాయి అని స్పష్టంగా రాయండి. ఇంట్లో మీరు పని చేయగల ప్రైవేట్ ప్లేస్, ల్యాప్‌టాప్, మొబైల్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నాయి అనే విషయాన్ని కూడా రిజ్యూమ్‌లో చెప్పండి. మీరు ముందుగా ఏవైనా చిన్నపాటి జాబ్స్ చేసిన అనుభవం ఉంటే అది కూడా రాయండి. మీకు తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడడం, అర్థం చేసుకోవడం వస్తే భాషల్లో స్పష్టంగా చెప్పండి. రిజ్యూమ్‌ను 1–2 పేజీలలో క్లీన్‌గా తయారు చేసి, PDF ఫార్మాట్‌లో సేవ్ చేయండి.
ఇంటర్వ్యూ టిప్స్
ఇండియామార్ట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్‌కి ఇంటర్వ్యూకు వెళ్లే ముందు కొంచెం ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. మొదటగా కంపెనీ గురించి కొద్దిగా తెలుసుకోండి, మీరు సీరియస్ అని వాళ్లకి అర్థం అవుతుంది. ఇంటర్వ్యూ సమయంలో ఫోన్, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్, హెడ్ఫోన్స్ రెడీగా ఉంచుకోండి. ఇంటర్వ్యూలో “ఈ జాబ్ ఎందుకు చేయాలి అనిపించింది?” అనే ప్రశ్న వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అందుకే మీకెందుకు ఈ జాబ్ అవసరమో ముందుగా నిర్ణయించుకోండి. ఫోన్ ద్వారా మాట్లాడే జాబ్ కాబట్టి, కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేయడం చాలా ఉపయోగపడుతుంది. తెలుగులోనైనా, ఇంగ్లీష్‌లోనైనా సాఫ్ట్‌గా, క్లియర్‌గా మాట్లాడండి. ఇంట్లో పని చేయడానికి మీ దగ్గర ల్యాప్‌టాప్, ఇంటర్నెట్, ప్రైవేట్ ప్లేస్ ఉందని స్పష్టంగా చెప్పండి. ఇంటర్వ్యూ టైమ్‌కి ముందే రెడీగా ఉండండి, అంతే, కన్‌ఫిడెంట్‌గా మాట్లాడితే సెలక్షన్ మీ దే!
తరచుగా అడిగే ప్రశ్నలు – FAQs
1. ఈ ఉద్యోగానికి మహిళలే అప్లై చేయాలా?
లేదు. ఎవరైనా అప్లై చేయవచ్చు. కానీ మహిళలు, ముఖ్యంగా తిరిగి కెరీర్ మొదలుపెట్టాలనుకుంటున్నవాళ్లకు ప్రాధాన్యత ఉంటుంది.
2. రోజుకి ఎంతసేపు పని చేయాలి?
రోజుకి కనీసం 3 నుండి 4 గంటలు పని చేయాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 మధ్య ఎప్పుడైనా పని చేయవచ్చు.
3. జీతం ఎంత ఉంటుంది?
కంపెనీ జీత వివరాలు వెల్లడించలేదు. ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.
4. వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి ఏమేం అవసరం?
ల్యాప్‌టాప్/కంప్యూటర్, ఆండ్రాయిడ్ ఫోన్, ఇంటర్నెట్, వేరే సిమ్, శాంతిగా పని చేయగల ప్రైవేట్ ప్లేస్ అవసరం.
5. ఏ డిగ్రీ అయినా సరే అప్లై చేయచ్చా?
అవును. ఏదైనా డిగ్రీ ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.
Disclaimer:
ఈ జాబ్‌కు సంబంధించిన సమాచారం ఇండియామార్ట్ అధికారిక వెబ్‌సైట్ ఆధారంగా ఇచ్చాం. కంపెనీ పాలసీలు, ఎంపిక విధానం, జీత వివరాలు తదితరాలు మారే అవకాశం ఉంది. దయచేసి అప్లై చేసే ముందు అధికారిక వెబ్‌సైట్ లేదా సంస్థ ద్వారా పూర్తి సమాచారం నిర్ధారించుకోండి. ఈ పోస్ట్ సమాచారం కోసం మాత్రమే, మీ అప్లికేషన్, ఎంపికపై మా బాధ్యత లేదు.