చెన్నైలోని NIE (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియోలజీ) 10 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్, యుప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) వంటి పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ డిగ్రీ/ఇంటర్ అర్హత ఉన్నవాళ్లకు మాత్రమే. ఎలాంటి అనుభవం అవసరం లేదు. జీతం కూడా మంచి రేంజ్‌లో ఉంటుంది. రెగ్యులర్ గవర్నమెంట్ ఉద్యోగమే కావడంతో భద్రతతో పాటు ఫ్యూచర్ సెటిల్ అవ్వడానికీ ఇది సూపర్ ఛాన్స్. జీతం, అర్హత, అప్లికేషన్ వివరాలు అన్నీ ఈ పోస్టులో క్లియర్‌గా ఇచ్చాం. పూర్తిగా చదివి, అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి!
ఈ NIE సంస్థ ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కి అటాచ్గా ఉంటుంది. ఇది దేశంలో ప్రముఖమైన పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్లలో ఒకటి.
ICMR NIE Recruitment 2025
NIE ఉద్యోగ నోటిఫికేషన్ 2025 – ఉద్యోగ వివరాలు
అంశం | వివరాలు |
---|---|
సంస్థ పేరు | నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియోలజీ (NIE) |
ఖాళీలు | 10 పోస్టులు |
పోస్టుల పేర్లు | అసిస్టెంట్, యుప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) |
పని చేయాల్సిన ప్రదేశం | అయపాక్కం, చెన్నై |
జీతం | రూ. 19,900 నుంచి రూ.1,12,400 వరకు |
దరఖాస్తు చివరి తేది | 14 ఆగస్ట్ 2025 |
వెబ్‌సైట్ | https://www.nie.gov.in |
ఈ పోస్టులు మొత్తం 10 ఉన్నాయి. వీటిలో అసిస్టెంట్, యుప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), మరియు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులు ఉన్నాయి. పని చెయ్యాల్సిన ప్రదేశం చెన్నైలోని అయపాక్కం అనే ఏరియాలో ఉంటుంది. జీతం కనీసం 19,900 నుండి గరిష్ఠంగా 1,12,400 రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తు చివరి తేది 14 ఆగస్ట్ 2025.
అర్హత వివరాలు
పోస్టు పేరు | జీతం (7th CPC లెవెల్) | వయస్సు పరిమితి | పోస్టుల సంఖ్య | రిజర్వేషన్ వివరాలు | అర్హతలు |
---|---|---|---|---|---|
అసిస్టెంట్ (Assistant) | లెవెల్ 6: ₹35,400 – ₹1,12,400 | 18 నుంచి 30 ఏళ్ళలోపు | 1 పోస్టు | OBC-1 | డిగ్రీ + కంప్యూటర్ నాలెడ్జ్ |
యుప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) | లెవెల్ 4: ₹25,500 – ₹81,100 | 18 నుంచి 27 ఏళ్ళలోపు | 2 పోస్టులు | UR-1, SC-1 | డిగ్రీ + టైపింగ్ స్కిల్ |
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) | లెవెల్ 2: ₹19,900 – ₹63,200 | 18 నుంచి 27 ఏళ్ళలోపు | 7 పోస్టులు | UR-5, OBC-1, SC-1 | ఇంటర్ + టైపింగ్ స్కిల్ |
అసిస్టెంట్ పోస్టు వివరాలు
పోస్టు పేరు: అసిస్టెంట్
గ్రూప్: Group B (Ministerial)
జీతం: లెవెల్ 6 – రూ.35,400 నుండి రూ.1,12,400 వరకు
వయస్సు: కనీసం 18 ఏళ్ళు ఉండాలి. గరిష్ఠంగా 30 ఏళ్ళ లోపు ఉండాలి.
మొత్తం ఖాళీలు: 1 పోస్టు (OBC కేటగిరీకి)
అర్హతలు:
- కనీసం 3 ఏళ్ళ డిగ్రీ (ఏదైనా సబ్జెక్ట్‌లో) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉండాలి.
- కంప్యూటర్ నెపుణ్యం ఉండాలి – ముఖ్యంగా MS Office, PowerPoint వంటి ప్రోగ్రామ్లలో పని చేయగలగాలి.
ఈ పోస్టు కొంచెం హయ్యర్ లెవెల్ క్యాడర్‌లో ఉంటుంది. కంప్యూటర్ అవగాహన తప్పనిసరి.
యుప్పర్ డివిజన్ క్లర్క్ (UDC)
పోస్టు పేరు: యుప్పర్ డివిజన్ క్లర్క్
గ్రూప్: Group C (Ministerial)
జీతం: లెవెల్ 4 – రూ.25,500 నుండి రూ.81,100 వరకు
వయస్సు: 18 నుంచి 27 ఏళ్ళ లోపు ఉండాలి.
మొత్తం ఖాళీలు: 2 పోస్టులు (1 – సాధారణ (UR), 1 – SC)
అర్హతలు:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉండాలి.
- కంప్యూటర్‌పై టైపింగ్ నెపుణ్యం అవసరం:
- ఇంగ్లీష్‌లో నిమిషానికి 35 పదాలు (w.p.m) టైపు చేయాలి లేదా
- హిందీలో నిమిషానికి 30 పదాలు టైపు చేయగలగాలి
- ఇది సగటున ప్రతి పదానికి 5 కీ డిప్రెషన్లతో 10500/9000 KDPH కు సమానం అవుతుంది.
ఈ పోస్టుకు టైపింగ్ స్పీడ్ చాలా ముఖ్యం. కంప్యూటర్ టైపింగ్ ప్రాక్టీస్ ఉన్నవాళ్లకు ఇది బెస్ట్ ఛాన్స్.
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
పోస్టు పేరు: లోయర్ డివిజన్ క్లర్క్
గ్రూప్: Group C (Ministerial)
జీతం: లెవెల్ 2 – రూ.19,900 నుండి రూ.63,200 వరకు
వయస్సు: కనీసం 18 ఏళ్ళు ఉండాలి. గరిష్ఠంగా 27 ఏళ్ళ లోపు ఉండాలి.
మొత్తం ఖాళీలు: 7 పోస్టులు
విభజన: UR-5, OBC-1, SC-1
హారిజాంటల్ రిజర్వేషన్: 1 – PwBD (డిసేబిలిటీ ఉన్నవారు), 1 – Ex-Servicemen (రిటైర్డ్ ఆర్మీ/navy/police)
అర్హతలు:
- కనీసం 12వ తరగతి (ఇంటర్మీడియట్) లేదా దానికి సమానమైన అర్హత గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుండి ఉండాలి.
- టైపింగ్ స్పీడ్ అవసరం:
- ఇంగ్లీష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా
- హిందీలో నిమిషానికి 30 పదాలు
- ఇది కూడా 10500/9000 KDPHకు సమానం అవుతుంది.
ఈ పోస్టు ఇంటర్ తర్వాత కంప్యూటర్ టైపింగ్ తెలిసినవాళ్లకు బాగుంటుంది. అలాగే ఫ్రెషర్స్‌కి ఇది మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశంగా చెప్పొచ్చు.
అప్లికేషన్ ఫీజు వివరాలు
పోస్టు పేరు | సాధారణ, EWS, OBC | SC / ST / PwD / ESM / మహిళలు |
---|---|---|
అసిస్టెంట్ | ₹2,000/- | ₹1,600/- |
యుప్పర్ డివిజన్ క్లర్క్ | ₹2,000/- | ₹1,600/- |
లోయర్ డివిజన్ క్లర్క్ | ₹2,000/- | ₹1,600/- |
దరఖాస్తు ఎలా చేయాలి?
ఈ NIE రిక్రూట్మెంట్‌కు దరఖాస్తు చేయాలంటే మీరు ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి.
- ముందుగా NIE యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి
- అక్కడ Recruitment Section లోకి వెళ్లాలి.
- Application ఫారాన్ని ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు ఉంటే చెల్లించాలి.
- ఏ తప్పు లేకుండా సరిగ్గా పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Assistant పోస్టు ఎంపిక విధానం:
1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) – ఆన్లైన్ పరీక్ష
2 కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) – Word, Excel, PowerPoint మీద ప్రాక్టికల్
3 అనుభవం ఉంటే అదనంగా మార్కులు (ఉన్నవాళ్లకి మాత్రమే ఇవ్వబడతాయి)
Upper Division Clerk (UDC) ఎంపిక విధానం:
1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) – ఆన్లైన్ పరీక్ష
2 టైపింగ్ స్కిల్ టెస్ట్ (Typing Test – కంప్యూటర్ పై English/Hindi టైపింగ్)
3 అనుభవం ఉంటే అదనంగా మార్కులు (ఉన్నవాళ్లకి మాత్రమే ఇవ్వబడతాయి)
Lower Division Clerk (LDC) ఎంపిక విధానం:
1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) – ఆన్లైన్ పరీక్ష
2 టైపింగ్ స్కిల్ టెస్ట్ (Typing Test – కంప్యూటర్ పై English/Hindi టైపింగ్)
3 అనుభవం ఉంటే అదనంగా మార్కులు (ఉన్నవాళ్లకి మాత్రమే ఇవ్వబడతాయి)
👉ICMR NIE Recruitment 2025 Notification PDF
జీతం, ఇతర లాభాలు
ఇక్కడ జీతం మినిమమ్ 19,900 రూపాయల నుంచి, 1,12,400 వరకు ఉంటుంది. ఇది పోస్ట్ ఆధారంగా మారుతుంది. జీతంతో పాటు:
- హౌస్ రెంట్ అలవెన్స్ (HRA)
- మెడికల్ ఫెసిలిటీస్
- లీవ్ బెనిఫిట్స్
- వర్క్‌షాప్‌లు, ట్రైనింగ్‌లు అటెండ్ చేసే అవకాశం, ఇవన్నీ కూడా ఉంటాయి.
NIE గురించి
NIE అంటే National Institute of Epidemiology. ఇది ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి చెందిన సంస్థ. ఇది 1999లో ఏర్పాటైంది.
ఇది తొలుత సెంట్రల్ జాల్మా ఇన్‌స్టిట్యూట్ ఫర్ లెప్రసీ (CJIL) మరియు IRMS (ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ మెడికల్ స్టాటిస్టిక్స్)లతో కలిపి చెన్నైలో స్థాపించారు.
NIE పని చేసే ప్రధాన విషయాలు:
- ఎపిడెమియోలాజికల్ స్టడీస్ (రోగాల వ్యాప్తి మీద పరిశోధనలు)
- బయో-స్టాటిస్టిక్స్ ట్రైనింగ్
- హెల్త్ స్కీముల మీద ఈవాల్యూయేషన్
- WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్)కి లెప్రసీ రీసెర్చ్‌లో సహకరించే స్థానం
తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)
1. వయసు పరిమితి ఏమైనా ఉందా?
ఒక్కో పోస్టుకు వయసు పరిమితి వేరుగా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
2. ఇతర దేశాల వారు అప్లై చేయచ్చా?
అవును, కానీ వీరికి వీసా మరియు వర్క్ పర్మిట్ ఉండాలి.
4. ఒకరికి ఎక్కువ పోస్టులకు అప్లై చేయచ్చా?
అవును, కానీ ప్రతి పోస్టుకీ విడిగా అప్లికేషన్ సమర్పించాలి.
ఈ NIE నోటిఫికేషన్ 2025 హెల్త్ మరియు రీసెర్చ్ రంగంలో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఉద్యోగ భద్రతతో పాటు గౌరవం, శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సిల్లబస్, ఎగ్జామ్ డీటెయిల్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ చూడండి. మీకు ఇది సరైనదే అనిపిస్తే వెంటనే అప్లై చేయండి!