ప్రముఖ MNC కంపెనీ అయిన Genpact ఇప్పుడు SQL Developer జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. B.Tech/MBA/MSc/MCA డిగ్రీ పూర్తి చేసినవాళ్లు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Genpact SQL Developer Recruitment 2025
అర్హత వివరాలు
B.Tech/MBA/MSc/MCA (ఏ బ్యాచ్ అయినా సరే) పూర్తి చేసి ఉండాలి, ఇంగ్లీష్ లో చదవడం, మాట్లాడడం, రాయడం రావాలి. MS SQL సర్వర్‌లో అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగానికి కావలసిన స్కిల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చదవండి.
వయో పరిమితి
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి, కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
జీతం (Salary)
జీతం గురించి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా చెప్పలేదు. కానీ పెద్ద MNC కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి సంవత్సరానికి ₹4 లక్షల నుండి ₹7 లక్షల వరకూ స్టార్టింగ్ శాలరీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది – అంచనా ప్రకారం. శాలరీ మీకున్న క్వాలిఫికేషన్, స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ పైన ఆధారపడి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటే, మీరు శాలరీ డిమాండ్ చెయ్యవచ్చు.
Genpact SQL Developer Recruitment 2025
ట్రైనింగ్
సెలెక్ట్ అయినా తర్వాత, మీకు కేటాయించిన ప్రాజెక్ట్‌పై ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్‌లో తీసుకుంటారు. ట్రైనింగ్ సమయం లో కూడా మీకు నిర్దారించిన శాలరీ ఇస్తారు.
ల్యాప్‌టాప్
ఎంపికైన అభ్యర్థులకు ల్యాప్‌టాప్ కంపెనీ నుంచి ఉచితంగా అందుతుంది. ఈ ల్యాప్‌టాప్‌తో మీరు ఉద్యోగానికి సంబంధించిన పనులు చేయవచ్చు.
ఉద్యోగ ప్రదేశం
Hyderabad.
Genpact SQL Developer Recruitment 2025
సెలెక్షన్ ప్రాసెస్
మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత, కంపెనీ మీ దరఖాస్తును జాగ్రత్తగా చూస్తుంది. ఆ తర్వాత, మిమ్మల్ని ఇంటర్వ్యూలకు పిలుస్తారు లేదా ఆన్లైన్ లో ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ లో మీతో మాట్లాడి, మీలోని నైపుణ్యాలు, మీ అర్హతలు ఎంతవరకు సరిపోతాయో చూస్తారు. అలాగే, మీరు కంపెనీ వాతావరణానికి ఎంత బాగా సరిపోతారనేది కూడా అంచనా వేస్తారు.
ఇవి పూర్తయిన తర్వాత, మీ గత అనుభవాలను తెలుసుకోవడానికి రెఫరెన్స్ చెక్స్ చేస్తారు. అంటే, మీరు గతంలో పని చేసిన చోట్ల మీ గురించి ఆరా తీస్తారు. అలాగే, మీ బ్యాక్‌గ్రౌండ్‌ను కూడా పరిశీలిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక, మీకు ఉద్యోగ ఆఫర్ ఇస్తారు. అప్పుడు మీరు కంపెనీలో చేరడానికి సిద్ధంగా ఉంటారు, దీనినే ఆన్-బోర్డింగ్ అంటారు.
ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చదవండి.
ఎలా అప్లై చేయాలి?
అప్లై చేయాలనుకునే వాళ్లు కింది లింక్ ద్వారా అప్లై చేయొచ్చు.
👉Apply Link: Click Here (జూలై 31, 2025 ఆఖరి తేదీ)
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
Genpact SQL Developer Recruitment 2025
దరఖాస్తు ఫీజు
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఎవరైనా మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి, కొంత డబ్బు (రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ వంటివి) కట్టమని అడిగితే, అది ఫ్రాడ్ అని గుర్తించండి. పెద్ద MNC కంపెనీలు ఎవరినీ అప్లికేషన్ ఫీజు అడగవు. మీరు ఎవరికీ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
Genpact కంపెనీ గురించి
Genpact అనేది ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ. ఇది 30 కంటే ఎక్కువ దేశాల్లో పని చేస్తోంది, అలాగే 1,25,000 మంది ఉద్యోగులు Genpact లో ఉన్నారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలకు బిజినెస్ సొల్యూషన్స్, డేటా అనలిసిస్, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డిజిటల్ టెక్నాలజీ సహాయంతో సర్వీసులు ఇస్తుంది.
ఈ కంపెనీ ప్రత్యేకత ఏమిటంటే – ఎటువంటి బిజినెస్ అయినా డేటా ఆధారంగా ఎలా మెరుగుపరచాలో చూపుతుంది. పెద్ద క్లయింట్లకు సరైన డెసిషన్స్ తీసుకునేలా డేటా ఇన్‌సైట్స్ అందించేది Genpact.
Genpact లో పని చేయడం అంటే, మీ ఆలోచనలు వర్క్‌లోకి మార్చే అవకాశం, ప్రపంచ స్థాయి క్లయింట్లతో కలిసి పని చేసే అనుభవం, మరియు మీ కెరీర్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. టీమ్ మేమ్బర్లు సహకారం ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే వాళ్లకి ఇది బెస్ట్ ప్లేస్.
Genpact ఉద్యోగులకి లభించే లాభాలు (Employee Benefits)
Genpact లో పని చేయడం వల్ల ఉద్యోగులకు చాలా మంచి లాభాలు ఉంటాయి. ఇవి కేవలం జీతం మాత్రమే కాదు – కెరీర్, వర్క్ కల్చర్, ఆరోగ్యం, మరియు భవిష్యత్తు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటాయి.
1. కెరీర్‌లో ఎదగడానికి అవకాశాలు (Career Growth Opportunities)
Genpact లో పని చేసే ప్రతి ఒక్కరికి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, ట్రైనింగ్‌లు తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్లేలా సపోర్ట్ చేస్తారు.
2. ఫ్రెండ్లీ వాతావరణం (Friendly Work Culture)
ఇక్కడ టీమ్ వర్క్, మ్యూచువల్ రీస్పెక్ట్ చాలా ఉంటుంది. మేనేజ్‌మెంట్ మరియు టీమ్ మెంబర్స్ అందరూ సహాయకంగా వ్యవహరిస్తారు. పని ఒత్తిడి తక్కువగా ఉండేలా చూసుకుంటారు.
3. సాఫీగా ఉండే పని గంటలు (Work-Life Balance)
Genpact లో 9 నుండి 5 వరకు ఒక structureగా పని ఉంటుంది. దీని వల్ల వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయించవచ్చు.
4. నిర్ధిష్టమైన జీతం మరియు ప్రమోషన్లు
ఉద్యోగం ప్రారంభంలోనే మంచి జీతం ఉంటుంది. మీరు బాగా పని చేస్తే తర్వాత సంవత్సరాల్లో ప్రమోషన్లు, పెరుగుదల కూడా వస్తాయి.
5. హెల్త్ & మెడికల్ బెనిఫిట్స్
Genpact ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ కవర్ వంటి ఫెసిలిటీలు కూడా ఇస్తారు. మీ కుటుంబానికి కూడా ఇది వర్తించవచ్చు.
6. అప్‌స్కిలింగ్‌కి సపోర్ట్
Genpact తన ఉద్యోగులకు డిజిటల్, డేటా రంగాల్లో మెరుగైన అవకాశాల కోసం ఉచితంగా కోర్సులు, వర్క్‌షాప్‌లు, సర్టిఫికేషన్ ట్రైనింగ్‌లు ఇస్తుంది.
7. గ్లోబల్ కంపెనీలో అనుభవం
Genpact ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కావడంతో, విదేశీ క్లయింట్స్‌తో పని చేసే అవకాశం, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుల్లో భాగం కావడం లాంటి గొప్ప అనుభవాలు పొందవచ్చు.
రెజ్యూమ్ (Resume) తయారుచేసే టిప్స్ – ఫ్రెషర్స్ కోసం
Genpact లాంటి కంపెనీలో ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే మీ రెజ్యూమే. అది బాగా ఉంటేనే ఇంటర్వ్యూకి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ టిప్స్ ఫాలో అవ్వండి:
1. రీసుమే క్లియర్ & షార్ట్‌గా ఉంచండి
- 1 పేజీ (లేదా 2 పేజీల లోపే) పూర్తి వివరాలు ఇవ్వండి
- ఎక్కువ ఫాంట్‌లు, డిజైన్లు అవసరం లేదు – neat & clean look
2. Contact Details తప్పకుండా వేసుకోండి
- Full Name, Mobile Number, Email ID క్లియర్‌గా ఉండాలి
- మెయిల్ ఐడి (example: name123@gmail.com)
3. Education వివరాలు ఒక టేబుల్‌లా క్లియర్‌గా ఉండాలి
- Year, Degree Name, College Name, Percentage చక్కగా వ్రాయండి
4. Skills అనే సెక్షన్ ప్రత్యేకంగా ఉంచండి
Genpact కోసం అవసరమైన Skills:
- SQL Queries
- MS SQL Server
- ETL Concepts
- QlikView (ఒక బోనస్)
- Communication Skills
5. Projects & Certifications ఉంటే తప్పకుండా వేసుకోండి
- అకాడమిక్ ప్రాజెక్ట్‌లు, ఇన్‌ట్‌ర్న్‌షిప్‌లు, ఫ్రీ కోర్సులు వగైరా
Genpact Interview Tips – ఫ్రెషర్స్ కి ఉపయోగపడేలా
Interview అంటే టెన్షన్ కాదు, ఒక casual conversation అని ఫీలవ్వండి. ఈ టిప్స్ ఫాలో అయితే ఇంటర్వ్యూలో మీ స్కోర్ పెరుగుతుంది!
1. Self Introduction ప్రాక్టీస్ చేయండి
- “నేను ఎవరు”, “ఏం చదివాను”, “ఏం నేర్చుకున్నాను”, “ఈ ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నాను?” అనే ప్రశ్నలకు 1-2 నిమిషాల్లో సమాధానం చెప్పగలగాలి.
2. SQL Concepts మీద కన్ఫిడెన్స్ ఉండాలి
- Basic to Intermediate SQL Queries రాయగలగాలి
- Joins, Group By, Subqueries, Stored Procedures గురించి తెలుసుకోండి
3. Real-time Examples చెప్పగలగండి
- “SQL ఎలా ఉపయోగించావు?” లాంటి ప్రశ్నలకు చిన్న exampleతో చెప్పండి
- Dummy project తీసుకుని వివరించండి
4. Problem-solving attitude చూపండి
- “ఒక ఎర్రర్ వస్తే ఏం చేస్తావు?” అన్న ప్రశ్నకు calm & logical wayలో చెప్పండి
- మీరు గమనించే, అనలైజ్ చేసే, సాల్వ్ చేసే అలవాటున్నట్లు చూపించండి
5. Communication మీద ఫోకస్ పెట్టండి
- స్పష్టంగా, నెమ్మదిగా మాట్లాడండి
- మీ English పరిపూర్ణంగా ఉండకపోయినా సరే, నమ్మకంగా మాట్లాడడం ముఖ్యం
- సరైన words, pronounciation ఉండేలా చూసుకోండి
Disclaimer:
పైన ఇచ్చిన ఉద్యోగ సమాచారం కేవలం మీకు సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఈ వివరాలు ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్ నుండి తీసుకున్నవి. మేము ఎలాంటి ఉద్యోగ హామీ ఇవ్వం. ఉద్యోగ నియామకం కంపెనీ అధికారిక ప్రక్రియ ప్రకారం జరుగుతుంది. మేము ఈ ఉద్యోగ సమాచారం అందించడానికి ఎటువంటి ఫీజు వసూలు చేయము.