డిగ్రీ పూర్తి చేసి బ్యాంక్‌లో ఫుల్ టైం సెక్యూర్ జాబ్ కోసం చూస్తున్నవారికి ఒక మంచి అవకాశం. IBPS Clerk 2025 షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్) పోస్టులు భర్తీ చేయనున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టులకి ఎవరు అర్హులు అంటే, డిగ్రీ పూర్తి చేసిన వాళ్లెవరైనా అప్లై చేయొచ్చు. సెలెక్షన్ సింపుల్‌గా రెండు ఎగ్జామ్స్ ఆధారంగా జరుగుతుంది – ప్రిలిమ్స్, మెయిన్స్. జీతం కూడా బాగుంటుంది, ఫ్యూచర్‌లో ప్రొమోషన్ ఛాన్సులు కూడా ఉన్నాయి. మీ డ్రీం బ్యాంక్ జాబ్ కోసం ఇదే సరిగ్గా సరైన టైం.
పూర్తి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. అయితే ఆగస్టు 1 నుంచి 21 వరకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. ప్రిలిమ్స్ అక్టోబర్‌లో, మెయిన్స్ నవంబర్‌లో జరగనున్నాయి.
IBPS Clerk 2025 Short Notification
IBPS Clerk 2025 – వివరాలు
సంస్థ పేరు | IBPS (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) |
పరీక్ష పేరు | IBPS Clerk Exam (CRP CSA XV) |
పోస్టు పేరు | క్లర్క్ (Customer Service Associate) |
ఉద్యోగ రకం | బ్యాంక్ ఉద్యోగం |
అప్లికేషన్ విధానం | ఆన్లైన్ |
అర్హత | డిగ్రీ (గ్రాడ్యుయేషన్) |
వయసు పరిమితి | కనీసం 20 ఏళ్లు, గరిష్టంగా 28 ఏళ్లు |
ఎంపిక విధానం | ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు |
పరీక్ష భాషలు | మొత్తం 13 ప్రాంతీయ భాషలు |
ఉద్యోగ ప్రాంతం | భారత్ అంతటా |
అధికారిక వెబ్‌సైట్ | www.ibps.in |
ఈ పరీక్షకు అప్లై చేయాలంటే కనీసం డిగ్రీ ఉత్తీర్ణత అవసరం. వయసు 20 నుంచి 28 మధ్య ఉండాలి. సెలెక్షన్ రెండు దశల్లో జరగుతుంది – ప్రిలిమ్స్, మెయిన్స్.
ముఖ్యమైన తేదీలు
చర్య | తేదీ |
---|---|
అప్లికేషన్ మొదలయ్యే తేదీ | 01 ఆగస్టు 2025 |
అప్లికేషన్ ముగిసే తేదీ | 21 ఆగస్టు 2025 |
ఫీజు చెల్లింపు తేదీలు | 01 ఆగస్టు నుంచి 21 ఆగస్టు వరకు |
ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు | 04, 05, 11 అక్టోబర్ 2025 |
మెయిన్స్ పరీక్ష తేదీ | 29 నవంబర్ 2025 |
తాత్కాలిక అలాట్మెంట్ | మార్చి 2026 |
పరీక్ష విధానం
ప్రిలిమ్స్ పరీక్ష:
సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం |
---|---|---|
ఇంగ్లీష్ | 30 | 20 నిమిషాలు |
న్యూమరికల్ అబిలిటీ | 35 | 20 నిమిషాలు |
రీజనింగ్ అబిలిటీ | 35 | 20 నిమిషాలు |
మొత్తం | 100 | 60 నిమిషాలు |
మెయిన్స్ పరీక్ష:
సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం |
---|---|---|
జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ | 50 | 35 నిమిషాలు |
ఇంగ్లీష్ | 40 | 35 నిమిషాలు |
రీజనింగ్ & కంప్యూటర్ | 50 | 45 నిమిషాలు |
క్వాంటిటేటివ్ అబిలిటీ | 50 | 45 నిమిషాలు |
మొత్తం | 190 | 160 నిమిషాలు |
గమనిక: తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
అర్హత వివరాలు
- విద్యా అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి.
- వయస్సు: 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది).
- జాతీయత: భారత పౌరుడు లేదా నేపాల్, భూటాన్, టిబెట్ శరణార్థి (1962కు ముందు వచ్చిన వారు) కానీ ఉండవచ్చు.
అప్లికేషన్ ఫీజు
కేటగిరీ | ఫీజు |
---|---|
SC/ST/PWBD/EXSM | ₹175 (GSTతో కలిపి) |
ఇతరులు | ₹850 (GSTతో కలిపి) |
అవసరమైన డాక్యుమెంట్లు
- ఫొటో (పాస్‌పోర్ట్ సైజ్)
- సంతకం
- ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు
- ID ప్రూఫ్
- ఎడమ చేతి వేలి ముద్ర (thumb impression)
- హ్యాండ్‌రైటెన్ డిక్లరేషన్ (నల్ల పెన్నుతో తెల్ల కాగితంపై రాయాలి)
హ్యాండ్‌రైటెన్ డిక్లరేషన్ టెక్స్ట్:
I, _______ (Name of the candidate), hereby declare that all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required.
పాల్గొనబోయే బ్యాంకులు
- బాంక్ ఆఫ్ బరోడా
- బాంక్ ఆఫ్ ఇండియా
- బాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- కానరా బ్యాంక్
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఇండియన్ బ్యాంక్
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- పంజాబ్ & సింధ్ బ్యాంక్
- యూకో బ్యాంక్
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
జీతం (సాలరీ)
IBPS క్లర్క్ పోస్టులో జాయిన్ అయిన వారికి స్టార్టింగ్ బేసిక్ పే ₹24,050 ఉంటుంది. DA, HRA, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్ కలిపి ₹35,000 నుంచి ₹39,000 వరకు ఇన్-హ్యాండ్ జీతం వస్తుంది.

సిలబస్ (ఒవర్వ్యూవ్)
ప్రిలిమ్స్:
- ఇంగ్లీష్
- న్యూమరికల్ అబిలిటీ
- రీజనింగ్ అబిలిటీ
మెయిన్స్:
- జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్
- ఇంగ్లీష్
- రీజనింగ్ & కంప్యూటర్
- క్వాంటిటేటివ్ అబిలిటీ
అప్లై చేసేందుకు లింక్
👉ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయండి
ప్రభుత్వ బ్యాంక్‌లలో క్లర్క్‌గా పని చేస్తే లాభాలు
1. జాబ్ సెక్యూరిటీ:
పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లో క్లర్క్‌గా జాయిన్ అయితే, అది లాంగ్ టర్మ్ స్టేబుల్ జాబ్. లేఅఫ్‌కి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
2. వర్క్-లైఫ్ బ్యాలెన్స్:
ఫిక్స్‌డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఇతర జాబ్స్‌తో పోలిస్తే వర్క్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. అందువల్ల పర్సనల్ టైమ్ కూడా సవ్యంగా ప్లాన్ చేసుకోవచ్చు.
3. కెరీర్ గ్రోత్:
క్లర్క్‌గా జాయిన్ అయిన తర్వాత కూడా, ఆఫీసర్ స్థాయికి ప్రమోషన్‌కు ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తూ మీ కెరీర్‌ను నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లవచ్చు.
4. మంచి జీతం మరియు అలవెన్సులు:
బేసిక్ జీతంతో పాటు DA, HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్ వంటి వేరే బెనిఫిట్స్ కూడా వస్తాయి.
5. ట్రాన్స్‌ఫర్లు & పోస్టింగ్‌లు:
ఇతర పోస్టులతో పోలిస్తే, క్లర్క్‌లను వాళ్ల హోమ్ స్టేట్‌కి దగ్గరగా పోస్టింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
6. గవర్నమెంట్ ప్రయోజనాలు:
పెన్షన్ స్కీమ్, మెడికల్ బెనిఫిట్స్, పయిడ్ లీవ్స్ వంటి ఫెసిలిటీలను కూడా పొందొచ్చు.
IBPS Clerk 2025లో తెలియని విషయాలు
హోమ్ స్టేట్ vs ఇతర స్టేట్:
మీకు మీ స్వగ్రామం దగ్గరే జాబ్ కావాలంటే, హోమ్ స్టేట్‌కి సంబంధించిన బ్యాంకులు ఎంపిక చేయాలి. ఇతర రాష్ట్రాల్లో అప్లై చేయాలంటే, ఆ రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం రావాలి.
లాంగ్వేజ్ ప్రొఫిషెన్సీ టెస్ట్ (LPT):
కొన్ని స్టేట్స్‌లో లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. దీన్ని సీరియస్‌గా తీసుకోకపోతే, సెలెక్షన్ వదిలి వదులుకోవలసిఉంటుంది. మీకు ఆ రాష్ట్ర భాష రావడం చాలా ముఖ్యం.
బ్యాంకుల ర్యాంకింగ్:
ఎక్కడా పోస్టింగ్ వస్తుందో తెలుసుకోవడం కంటే, ఏ బ్యాంక్‌లో ఫ్యూచర్ గ్రోత్ బెటర్‌గా ఉంటుంది అనేది చూసి ఆ బ్యాంకుని ప్రిఫర్ చేయడం మంచిది.
IBPS Clerk టై బ్రేకింగ్ పాలసీ
ఒకే స్కోర్ వచ్చిన కాండిడేట్స్‌కి, డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ప్రాధాన్యత ఇస్తారు. వయసు ఎక్కువ వాడికే ముందు అవకాశం వస్తుంది. మెరిట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ పోస్టింగ్ ఉంటుంది.
IBPS Clerk ఎగ్జామ్ లాంగ్వేజ్
ఈ ఎగ్జామ్ ఇంగ్లిష్, హిందీ, మరియు రాష్ట్ర ప్రాతినిధ్యానికి అనుగుణంగా ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. ఉదాహరణకి:
- ఆంధ్రప్రదేశ్ – ఇంగ్లిష్, హిందీ, తెలుగు
- తెలంగాణ – ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ
- మహారాష్ట్ర – ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, కొంకణీ
- తమిళనాడు – ఇంగ్లిష్, హిందీ, తమిళ్
(ఇలా ప్రతి రాష్ట్రానికి ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ ఉంటుంది)
IBPS Clerk 2025 Cut-Off
ప్రతి స్టేజ్‌కు కట్-ఆఫ్ మార్కులు ఉంటాయి. 2024లో వన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలో హయ్యెస్ట్ కట్-ఆఫ్ West Bengalలో 87.75 మార్కులు. కొన్ని స్టేట్స్‌లో కట్-ఆఫ్ ఇలా ఉంది:
రాష్ట్రం | కట్-ఆఫ్ మార్కులు (UR) |
---|---|
ఆంధ్రప్రదేశ్ | 77.50 |
బీహార్ | 79.50 |
ఢిల్లీ | 80.75 |
హర్యానా | 83.00 |
కర్ణాటక | 65.75 |
ఒడిశా | 86.75 |
పంజాబ్ | 81.25 |
ఉత్తరప్రదేశ్ | 79.00 |
వెస్ట్ బెంగాల్ | 87.75 |
అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు
ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే ఈ డాక్యుమెంట్లు స్కాన్ చేసి సిద్ధంగా ఉంచాలి:
- ఫొటో
- సిగ్నేచర్
- ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు
- ఎలిజిబిలిటీ ప్రూఫ్
- హ్యాండ్‌రైటెన్ డిక్లరేషన్ (బ్లాక్ ఇంక్‌తో తెల్ల కాగితం మీద)
IBPS Clerk ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయచ్చా?
అవును. ప్రిలిమ్స్ ఎగ్జామ్ సాధారణంగా ఈజీ లెవల్‌లో ఉంటుంది. స్పీడ్ & అక్యురసీతో రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా పాస్ అవొచ్చు. మెయిన్స్‌కి మాత్రం సబ్జెక్టు మీద మంచి అవగాహన ఉండాలి.
గత సంవత్సరం పేపర్స్ ఉపయోగించుకోవచ్చా?
చాలా ఉపయోగపడతాయి. గత సంవత్సరాల పేపర్లు సాల్వ్ చేస్తూ టైమ్ మేనేజ్‌మెంట్ పెంచుకోవచ్చు. ఏ రకమైన ప్రశ్నలు వస్తాయో ముందే తెలుసుకోవచ్చు.
Online Coaching ఉపయోగపడుతుందా?
ఒక ఫిక్స్‌డ్ టైమ్‌లో చదవలేని వాళ్లకి ఆన్‌లైన్ కోచింగ్ చాలా ఉపగకరం.
మాక్ టెస్ట్స్ ఎందుకు అవసరం?
రియల్ ఎగ్జామ్ తరహాలో ప్రాక్టీస్ కావాలంటే మాక్ టెస్ట్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. మాక్ టెస్ట్స్ వల్ల టైమ్ మేనేజ్‌మెంట్, వీక్ ఏరియాస్ గుర్తించుకోవచ్చు.
IBPS Clerk 2025 ప్రిపరేషన్ టిప్స్
- ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి
- సిలబస్ బాగా తెలుసుకోండి
- రోజువారీ స్టడీ ప్లాన్ తయారు చేసుకోండి
- బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోండి
- డైలీ ప్రాక్టీస్ చేయండి
- టైమ్ మేనేజ్‌మెంట్ మెరుగుపరచండి
- Mock టెస్ట్స్ రాయండి
- బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి
తరచుగా అడిగే ప్రశ్నలు
1. IBPS Clerk కి ఎలా అప్లై చేయాలి?
అధికారిక వెబ్‌సైట్ అయిన www.ibps.in కి వెళ్లి, ఆన్లైన్ ఫారమ్ నింపాలి.
2. అప్లికేషన్ ఫీజు ఎంత?
SC/ST/PWD/EXSM వాళ్లకు ₹175, మిగతావారికి ₹850.
3. పరీక్ష భాష ఏంటి?
పరీక్ష 13 భాషల్లో ఉంటుంది. తెలంగాణలో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ఉంటుంది.
4. సెలెక్షన్ ఎలా జరుగుతుంది?
మొదట ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినవారే మెయిన్స్ రాయడానికి అర్హులు.
5. డిక్లరేషన్ తప్పుగా అప్లోడ్ చేస్తే ఏం జరుగుతుంది?
అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి స్పష్టంగా, పక్కాగా అప్లోడ్ చేయాలి.