RRB Paramedical Jobs 2025-Pharmacy, Nursing, Lab Technician చదివినవాళ్లకి Railway Jobs!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇండియన్ రైల్వే వారు 2025కి సంబంధించి RRB పరామెడికల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 434 ఉద్యోగాలు ఉన్నాయి — వీటిలో నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్, ECG టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్ వంటి వైద్యానికి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. మీరు నర్సింగ్, ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్, డయాలసిస్, ECG లేదా హెల్త్ ఇన్‌స్పెక్టర్ లాంటి కోర్సులు complete చేసినవారైతే, ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు .

RRB Paramedical Jobs 2025

పోస్టులు & ఖాళీలు

ఈ సంవత్సరం 434 పోస్టులను కేంద్ర రైల్వే నియామక బోర్డు భర్తీ చేయనుంది. వీటిలో కింద చెప్పిన 7 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి:

  • నర్సింగ్ సూపరింటెండెంట్: 272 పోస్టులు
  • ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్): 105 పోస్టులు
  • హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్ III: 33 పోస్టులు
  • డయాలసిస్ టెక్నీషియన్: 4 పోస్టులు
  • ECG టెక్నీషియన్: 4 పోస్టులు
  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ II: 12 పోస్టులు
  • రేడియోగ్రాఫర్ X-రే టెక్నీషియన్: 4 పోస్టులు

మొత్తం ఖాళీలు: 434

ఎవరు అప్లై చేయచ్చు? అర్హత వివరాలు

ఈ పోస్టులకు అప్లై చేయాలంటే మీ దగ్గర నిర్దిష్ట విద్యార్హతలు ఉండాలి. ఎటువంటి అభ్యర్థులు చదువు పూర్తి కాకపోయి ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్లు అప్లై చేయరాదు.

వయస్సు పరిమితి (01-01-2026 ప్రకారం):

  • నర్సింగ్ సూపరింటెండెంట్ – 20 నుంచి 43 సంవత్సరాలు
  • హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ – 18 నుంచి 36 సంవత్సరాలు
  • డయాలసిస్ టెక్నీషియన్ – 20 నుంచి 36 సంవత్సరాలు
  • ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) – 20 నుంచి 38 సంవత్సరాలు
  • రేడియోగ్రాఫర్ X-Ray టెక్నీషియన్ – 19 నుంచి 36 సంవత్సరాలు
  • ECG టెక్నీషియన్ – 18 నుంచి 36 సంవత్సరాలు
  • ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ II – 18 నుంచి 36 సంవత్సరాలు

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల: 23 జూలై 2025
  • ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్: 9 ఆగస్ట్ 2025
  • ఆఖరి తేదీ: 8 సెప్టెంబర్ 2025
  • ఫీజు చెల్లింపు చివరి తేదీ: 8 సెప్టెంబర్ 2025
  • ఎగ్జామ్ తేదీ, అడ్మిట్ కార్డ్ – ఇంకా ప్రకటించలేదు

అప్లికేషన్ విధానం

ఈ రిక్రూట్మెంట్ కి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. అధికారిక వెబ్‌సైట్‌లో (www.rrbapply.gov.in) 2025 ఆగస్ట్ 9 నుంచి లింక్ యాక్టివ్ అవుతుంది. మీరు మీ ఫోటో, సిగ్నేచర్, విద్యా ధృవీకరణ పత్రాలు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

RRB Paramedical Jobs 2025 Official Notification👇

అప్లికేషన్ ఫీజు

అభ్యర్థులు కింద చూపిన రీతిలో ఫీజు చెల్లించాలి:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
  • సాధారణ & OBC అభ్యర్థులు: ₹500
  • SC, ST, ఎక్స్-సర్వీస్ మెన్, ట్రాన్స్ జెండర్, దివ్యాంగులు: ₹250

మీరు పరీక్ష రాస్తే, అప్లికేషన్ ఫీజులో కొంత మొత్తం మిమ్మల్ని తిరిగి చెల్లించబడుతుంది.

ఫీజు చెల్లింపుకు మార్గాలు: డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యుపీఐ, నెట్ బ్యాంకింగ్, SBI చలాన్, పోస్టాఫీస్ చలాన్

ఎంపిక విధానం

ఈ రిక్రూట్మెంట్ లో ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది:

  1. Computer-Based Test (CBT)
  2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
  3. మెడికల్ టెస్టు

CBT పరీక్ష విధానం

పరీక్ష మొత్తం 90 నిమిషాల పాటు ఉంటుంది. మొత్తం 100 మార్కులు.

  • ప్రొఫెషనల్ అబిలిటీ – 70 ప్రశ్నలు – 70 మార్కులు
  • జనరల్ అవేర్నెస్ – 10 ప్రశ్నలు – 10 మార్కులు
  • అరిత్మెటిక్స్, రీజనింగ్, ఇంటెలిజెన్స్ – 10 ప్రశ్నలు – 10 మార్కులు
  • జనరల్ సైన్స్ – 10 ప్రశ్నలు – 10 మార్కులు

తప్పు సమాధానానికి 0.25 మార్కులు మైనస్ అవుతాయి. మీరే ప్రశ్న attempt చేయకపోతే మైనస్ ఉండదు.

మార్కుల నార్మలైజేషన్

పరీక్ష ఒకేసారి కాకుండా మల్టిపుల్ షిఫ్ట్లలో జరిగితే నార్మలైజేషన్ పద్ధతిని అనుసరిస్తారు. దీనివల్ల అన్ని అభ్యర్థులకి సమాన అవకాశాలు కల్పిస్తారు.

జీతం వివరాలు (పోస్టు వారీగా)

ఈ పరీక్షలో సెలెక్ట్ అయ్యిన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం మంచి జీతం ఉంటుంది.

  • నర్సింగ్ సూపరింటెండెంట్ – Pay Level 7 – ప్రారంభ జీతం ₹44,900
  • డయాలసిస్ టెక్నీషియన్ – Pay Level 6 – ₹35,400
  • హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ – Pay Level 6 – ₹35,400
  • ల్యాబ్ సూపరింటెండెంట్ గ్రేడ్ III – Pay Level 6 – ₹35,400
  • ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) – Pay Level 5 – ₹29,200
  • రేడియోగ్రాఫర్ X-ray టెక్నీషియన్ – Pay Level 5 – ₹29,200
  • ECG టెక్నీషియన్ – Pay Level 4 – ₹25,500

అప్లై లింక్

👉 అప్లై చేయడానికి అధికారిక లింక్: https://rrbapply.gov.in
ఈ లింక్ ఆగస్ట్ 9, 2025 నుంచి యాక్టివ్ అవుతుంది.

Railway పరామెడికల్ ఉద్యోగానికి కొన్ని సెలక్షన్ టిప్స్

1. మీరు అప్లై చేసే పోస్టుకి అర్హత ఉందో స్పష్టంగా చూసుకోండి

పోస్ట్ కి కావాల్సిన అకాడమిక్ క్వాలిఫికేషన్, వయస్సు పరిమితి, ఇతర అర్హతలు మీకు ఉన్నాయా అని అప్లై చేసే ముందు బాగా చెక్ చేసుకోండి. ఏ చిన్న డౌట్ వచ్చినా నోటిఫికేషన్ చదివి కన్‌ఫర్మ్ చేసుకోండి. లేదంటే అప్లికేషన్ తిరస్కరించబడే ఛాన్స్ ఉంటుంది.

2. CBT పరీక్ష సిలబస్‌కి ప్రాక్టికల్ గా ప్రిపేర్ అవ్వండి

పరీక్షలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ కి 70 మార్కులు ఉంటాయి కాబట్టి మీరు చేసిన కోర్సులో ముఖ్యమైన concepts, ప్రాక్టికల్ విషయాలు బాగా రివైజ్ చేయండి. అలాగే జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్స్, రీజనింగ్, సైన్స్ మీద రోజుకు కనీసం ఒక గంట ప్రాక్టీస్ చేయండి.

3. మాక్ టెస్ట్లు రాయండి, టైమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకోండి

పరీక్షకు ముందు రోజూ ఒక మాక్ టెస్ట్ రాసి టైమ్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్ చేయండి. టైమింగ్ కలపకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఏ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నారో కూడా తెలుస్తుంది.

4. అప్లికేషన్ సమయంలో దరఖాస్తు జాగ్రత్తగా ఫిల్ చేయండి

ఒకసారి అప్లికేషన్ ఫిల్ చేసిన తరువాత తిరిగి ఎడిట్ చేయలేరు. అందుకే మీ ఫోటో, సంతకం, డాక్యుమెంట్లు, పేరు, వయస్సు, పోస్టు డీటెయిల్స్ అన్నీ బాగా చెక్ చేసి submit చేయండి.

5. ఆరోగ్యంగా ఉండండి, మెడికల్ టెస్టు ఉంటుందని మర్చిపోకండి

ఈ ఉద్యోగానికి ఎంపికయ్యాక మెడికల్ పరీక్ష తప్పనిసరిగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండేలా డైట్, నిద్ర, ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇవ్వండి.

ఈ టిప్స్ మీకు తప్పకుండా సహాయపడతాయి. ప్రతి దశలో కూడా concentration, planning ఉండాలి. ఓపికగా, ప్రాక్టీస్‌తో ముందుకు వెళ్తే Railway లో గవర్నమెంట్ జాబ్ మీదే!

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) గురించి తెలుసుకోండి

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) అనేది ఇండియన్ రైల్వే లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకి ఎంపిక చేయడానికే ప్రత్యేకంగా ఏర్పాటైన నియామక సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన అతి పెద్ద ఉద్యోగ నియామక సంస్థలలో ఒకటి.

దేశం మొత్తం మీద 21 RRBలు ఉన్నాయి – ప్రతి ఒక్కటి ఓ ప్రాంతానికీ సంబంధించి పనిచేస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ RRB, సెకండరాబాద్ RRB, ముంబై RRB, కలకత్తా RRB వంటివి.

RRB ద్వారా:

  • టెక్నికల్ (లేక్ ట్రై Technician),
  • నాన్-టెక్నికల్ (క్లర్క్, అకౌంటెంట్)
  • ఇప్పుడు మనం చూస్తున్నట్టు పారామెడికల్ పోస్టులు (Nursing, Pharmacist, Technician)
    వంటి ఉద్యోగాలకి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

పరీక్షలు పూర్తిగా ఆన్‌లైన్ CBT విధానంలో జరుగుతాయి. ఎంపిక జరిగాక అభ్యర్థులను సంబంధిత జోన్‌కి పోస్టింగ్ ఇస్తారు.

RRB ద్వారా వచ్చే జాబ్స్‌కి:

  • జీతం బాగుంటుంది
  • జాబ్ సెక్యూరిటీ ఉంటుంది
  • పర్సనల్ డెవలప్మెంట్‌కి అవకాశాలు కూడా బాగుంటాయి

ఒక్క మాటలో చెప్పాలంటే, RRB అనేది భారత రైల్వేలో ఉద్యోగం కలకాలం పొందాలనే వారికి మొదటి అడుగు వేసే బోర్డు. మీరు అర్హతలు ఉండి, కాస్త ప్రిపేర్ అయితే, మంచి భవిష్యత్తు గ్యారెంటీ!

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. RRB పరామెడికల్ రిక్రూట్మెంట్ కు డిగ్రీ తప్పనిసరా?
ప్రతి పోస్టుకి ప్రత్యేక విద్యార్హతలు అవసరం. కొన్ని పోస్టులకు డిప్లొమా సరిపోతుంది, కొన్ని డిగ్రీ కావాలి. పూర్తి నోటిఫికేషన్ వచ్చాక స్పష్టంగా తెలుస్తుంది.

2. అప్లికేషన్ ఫీజు తిరిగి వస్తుందా?
మీరు CBT పరీక్ష రాసిన తర్వాత మాత్రమే ఫీజు కొంతమేరకు తిరిగి వస్తుంది.

3. ఈ జాబ్స్ AP, తెలంగాణా అభ్యర్థులు అప్లై చేయచ్చా?
అవును. ఇది నేషనల్ లెవల్ రిక్రూట్మెంట్. ఏ రాష్ట్రం అభ్యర్థులైనా అప్లై చేయవచ్చు.

4. ఒక అభ్యర్థి ఒక్కసారే అప్లై చేయాలా?
అవును. ఒకే పోస్టుకు ఒక్కసారి మాత్రమే అప్లై చేయాలి. లేదంటే అప్లికేషన్ తిరస్కరించబడే అవకాశం ఉంటుంది.

5. ఎగ్జామ్ లో నెగటివ్ మార్కింగ్ ఉంటుందా?
అవును. ఒక్కో తప్పు సమాధానానికి 0.25 మార్కులు మైనస్ అవుతాయి.

Leave a Comment